నేడు ఈ రాశి వారికి అవసరానికి అందనున్న ధన సహాయం
బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి.
By జ్యోత్స్న Published on 19 Feb 2024 6:16 AM ISTనేడు ఈ రాశి వారికి అవసరానికి అందనున్న ధన సహాయం
మేషం: ఉద్యోగస్థులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి.
వృషభం: బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటబయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
మిధునం: వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయం సాధిస్తారు.
కర్కాటకం: ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు సర్దుమణుగుతాయి. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలు తీరుతాయి.
సింహం: సోదరుల మాటపట్టింపులుంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపార విషయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
కన్య: సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆర్ధిక సమస్యలు నుంచి కొంత వరకు బయటపడతారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.
తుల: నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.
వృశ్చికం: ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
ధనస్సు: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపార విషయంలో నిర్లక్ష్యం చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మకరం: వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో తొందరపాటు పనిచేయదు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
కుంభం: నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
మీనం: ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులుకు ఇంటర్వ్యూలకు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించి లాభాలు పొందుతారు. మిత్రులతో కలిసి విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.