దిన ఫలితాలు: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు

సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  18 Nov 2023 12:51 AM GMT
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలితాలు: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు

మేషం:

సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు.

వృషభం:

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీకోలేరు.

మిధునం:

ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగము న ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

సింహం:

కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కన్య:

దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

తుల:

ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చికం:

చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మ విశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది.

ధనస్సు:

ఇతరుల ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి.

మకరం:

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదుల తో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. సనిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం:

చేపట్టిన పనులు నత్త నడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి.

మీనం:

అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి.ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.

Next Story