నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు

ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

By జ్యోత్స్న  Published on  18 Sep 2023 12:47 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు

మేషం: అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి . నూతన రుణయత్నాలు చేస్తారు . ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. పనులలో శ్రమ తప్పదు . వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మిధునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఉద్యోగమున అధికారులతో వ్యతిరేకత పెరుగుతుంది.

కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహం: ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కన్య: ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

తుల: చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం అందదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి.

మకరం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మీనం: ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Next Story