ఈ రాశివారి ఉద్యోగ జీవితం ప్ర‌శాంతంగా సాగుతుంది

సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on  18 March 2023 1:11 AM GMT
Daily Horoscope,Astrology,Rasi Phalalu

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మేషం : సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.

వృషభం : దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఉద్యోగాలలో అధికారులనుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.

మిధునం : ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తిఅవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం : విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

సింహం : నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య : వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

తుల : మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం : వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనస్సు : నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

మకరం : సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.

కుంభం : వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం : నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

Next Story