నేడు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం
నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు.
By జ్యోత్స్న Published on 17 Oct 2024 9:37 AM ISTనేడు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం
మేషం:
ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘాకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అదిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం ఉన్నది.
వృషభం:
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అదిగమిస్తారు.
మిధునం:
ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి.
కర్కాటకం:
మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం:
బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది.
కన్య:
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు.
తుల:
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చికం:
నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలొ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
ధనస్సు:
మిత్రులతో వ్యాపార విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులు నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు.
మకరం:
ఇతరులతో ఏర్పడిన వివాదాలు మిత్రుల సహాయంతో రాజీచేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగమున స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.
కుంభం:
వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరావుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు.
మీనం:
సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.