దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చికాకులు.. చేపట్టిన పనుల్లో జాప్యం

సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  17 May 2023 12:50 AM GMT
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చికాకులు.. చేపట్టిన పనుల్లో జాప్యం

మేషం: వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి.

వృషభం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

మిధునం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

సింహం: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ధన ఇబ్బందులుంటాయి.

కన్య: పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో పరిస్థితి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగ అంత సంతృప్తికరంగా సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది.

తుల: ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృత్తి వ్యాపారములు పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం: ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

ధనస్సు: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులుతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేయడం వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తప్పవు. విద్యార్థులకు నిరుద్యోగులకు అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు.

మకరం: గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కుంభం: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.

మీనం: సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. గృహంలో శుభకార్యాలు పరమైన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని అధిగమించి లాభాల అందుకుంటారు.

Next Story