దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.

By జ్యోత్స్న  Published on  17 Jan 2024 12:44 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

మేషం: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

వృషభం: ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మిధునం: వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

సింహం: గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

కన్య: బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

తుల: ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు: ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

మకరం: ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

కుంభం: దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం: సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

Next Story