దిన ఫలాలు: నేడు వీరికి పెరగనున్న ధన మార్గాలు.. దీర్ఘకాలిక సమస్యలలో విజయం
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలలో విజయం సాధిస్తారు. ఋణ సమస్యలు నుండి ఊరట కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 16 Oct 2024 6:07 AM ISTదిన ఫలాలు: నేడు వీరికి పెరగనున్న ధన మార్గాలు.. దీర్ఘకాలిక సమస్యలలో విజయం
మేషం:
పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృషభం:
కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.
మిధునం:
నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం:
గృహమున సంతాన శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక అనుకూలత పెరుగుతుంది.
సింహం:
ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగమున స్వల్ప ఇబ్బందులుంటాయి.
కన్య:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
తుల:
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలలో విజయం సాధిస్తారు. ఋణ సమస్యలు నుండి ఊరట కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.
వృశ్చికం:
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పునరాలోచన చెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
ధనస్సు:
ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
మకరం:
వాహన ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం:
ఇంటాబయట అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
మీనం:
చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు. వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.