కనుమ పండుగ వేళ.. ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది.
By జ్యోత్స్న Published on 15 Jan 2025 6:16 AM ISTకనుమ పండుగ వేళ.. ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
మేషం:
వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాల వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
వృషభం:
స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
మిధునం:
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
కర్కాటకం:
భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలమవుతాయి.
సింహం:
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
కన్య:
చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
తుల:
ఆధ్యాత్మక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలను ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.
వృశ్చికం:
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
ధనస్సు:
చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను లభిస్తాయి.
మకరం:
ముఖ్యమైన పనులు మందగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి.
కుంభం:
ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయట కొందరు మాటలు మానసికంగా కలచి వేస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
మీనం:
ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమవుతాయి.