దిన ఫలాలు: ఈ రాశి వారికి బంధుమిత్రులతో విభేదాలు

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి.

By జ్యోత్స్న  Published on  14 July 2023 12:44 AM GMT
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలాలు: ఈ రాశి వారికి బంధుమిత్రులతో విభేదాలు

మేషం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

వృషభం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మిధునం: నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం: ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

సింహం: నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరం వాతావరణం ఉంటుంది.

కన్య: ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

తుల: బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది.

వృశ్చికం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

ధనస్సు: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం: వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

Next Story