దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో అవరోధాలు

చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

By జ్యోత్స్న  Published on  14 Jun 2024 6:16 AM IST
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో అవరోధాలు

మేషం: జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

వృషభం : ఆప్తుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

మిధునం: మీ మాటతీరు ఇతరులకు భాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల కోపానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.

కర్కాటకం: నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. పాతమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి.

కన్య: కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు.

తుల: ఇంటా బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసి వస్తాయి. ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం: ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

కుంభం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. మీప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

మీనం: పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

Next Story