నేడు ఈ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు.. ఆర్థికంగా మరింత పురోగతి
ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
By అంజి Published on 13 Dec 2024 12:53 AM GMTనేడు ఈ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు.. ఆర్థికంగా మరింత పురోగతి
మేషం:
ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.
వృషభం:
కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మిధునం:
బంధు మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
కర్కాటకం:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహపరుస్తుంది. ఇంటాబయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి.
సింహం:
దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులతో పాత విషయాల గూర్చి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.
కన్య:
నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
తుల:
కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. ఋణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగము అధికారులతో చర్చలు ఫలించవు.
వృశ్చికం:
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దూరప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.
ధనస్సు:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
మకరం:
చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి .వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో మన భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. సంతానం విద్యా పరంగా మరింత సారించడం మంచిది.
కుంభం:
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.
మీనం:
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.