దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందో తెలుసా?
నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 13 Jun 2024 12:36 AM GMTదిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందో తెలుసా?
మేషం: నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.
వృషభం: ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికిపూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.
మిధునం: నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కర్కాటకం: మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
సింహం: వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కన్య: ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.
తుల: పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
వృశ్చికం: ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.
ధనస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.
మకరం: వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.
కుంభం: వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.
మీనం: నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.