దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
By జ్యోత్స్న Published on 12 Nov 2024 12:50 AM GMTదిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
మేషం:
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.
వృషభం:
చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.
మిధునం:
ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కర్కాటకం:
వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
సింహం:
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య:
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు.
తుల:
నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి.
వృశ్చికం:
ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ధనస్సు:
సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.
మకరం:
ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
కుంభం:
నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
మీనం:
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.