దిన ఫలితాలు: సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి

సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  12 Aug 2024 6:22 AM IST
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలితాలు: సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి

మేషం:

సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభం:

కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు.

మిధునం:

కుటుంబ సభ్యులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం:

కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగ, ప్రయత్నాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు.

సింహం:

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య:

ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

తుల:

ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆరోగ్య అభివృద్ధి చేయడం మంచిది కాదు. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు.

ధనస్సు:

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్థాయి.

మకరం:

నిరుద్యోగుల యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభం:

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యటం మంచిది కాదు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

మీనం:

కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత మందకొడిగా సాగుతుంది. ధన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.

Next Story