దిన ఫలాలు: పాత మిత్రులతో వివాదాలను పరిష్కారం.. ఉద్యోగులకు పదోన్నతులు

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. పాత మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 March 2024 12:49 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: పాత మిత్రులతో వివాదాలను పరిష్కారం.. ఉద్యోగులకు పదోన్నతులు

మేషం: వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

వృషభం: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. పాత మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

మిధునం: సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. వాహనాలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

కర్కాటకం: దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

సింహం: ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. గృహమున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువులతో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు అధిగమిస్తారు.

కన్య: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్చడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు ఉత్సాహనిస్తాయి. భూ క్రయ విక్రయాలలో స్వల్పలాభాలు అందుతాయి.

తుల: వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహరాలు నిదానంగా సాగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం: నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

ధనస్సు: దూర ప్రయాణాలు కలసి వస్తాయి. మిత్రుల నుండి వివాదాలకు సంభందించి విలువైన సమాచారం సేకరిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మకరం: మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

కుంభం: వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు.

మీనం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

Next Story