దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

By జ్యోత్స్న  Published on  12 Feb 2024 6:09 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

మేషం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

వృషభం: దూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిధునం: ఆర్ధిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు.

సింహం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. దైవ చింతన పెరుగుతుంది.

కన్య: బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

తుల: ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.

వృశ్చికం: ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు: కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఋణ యత్నాలు మందగిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు.

మీనం: ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు.

Next Story