నేడు ఈ రాశి వారికి వ్యయప్రయాసలు తప్పవు

చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి.

By జ్యోత్స్న  Published on  12 Jan 2024 12:45 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

నేడు ఈ రాశి వ్యయప్రయాసలు తప్పవు

మేషం: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చాగలుగుతారు.

వృషభం: చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మిధునం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.

కర్కాటకం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశములు అందుతాయి. విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

సింహం: కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య: భూవివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

తుల: చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు: సంతనానికి విద్య ఉద్యోగ అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మకరం: కుటుంబ సభ్యులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

కుంభం: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

Next Story