నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు.. ఆర్థిక ఇబ్బందులు

చేపట్టిన పనులలో అవరోధాలుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు మరింత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు.

By జ్యోత్స్న  Published on  11 Jun 2024 12:39 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు.. ఆర్థిక ఇబ్బందులు

మేషం: చేపట్టిన పనులలో అవరోధాలుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు మరింత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

మిధునం: ప్రముఖుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. రాజకీయ సంబంధిత సభ సమావేశాలు హాజరవుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.

కర్కాటకం: సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు వస్త్రా లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

సింహం: చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఇతరుల విషయంలో మాట ఇచ్చి విమర్శలను ఎదుర్కొంటారు.

కన్య: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలికఋణ ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి ఇతరుల నుండి సహాయం అందదు.

తుల: ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. సోదరుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరిచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం: ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టినపనులు మధ్యలో నిలిపివేస్తారు. సోదరులతో ఒక ముఖ్య విషయమై వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

ధనస్సు: దూరప్రాంత బంధు మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఊహించని ప్రయాణం సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరపు బంధువుల రాక కొంత ఆనందం కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా ఆప్తుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు.

మీనం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

Next Story