దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు

చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  10 Aug 2023 12:47 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు 

మేషం: చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

వృషభం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

మిధునం: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం: ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

సింహం: ఆదాయం విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారములలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. బంధు వర్గం వారితో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

తుల: కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చుతాయి. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు: మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

మకరం: ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పాతరుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కుంభం: ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది.

మీనం: చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు.

Next Story