ఆరోగ్య విష‌యంలో శ్ర‌ద్ధ అవ‌స‌రం

వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు

By జ్యోత్స్న  Published on  10 March 2023 1:52 AM GMT
Daily Horoscope,Astrology,Rasi Phalalu

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మేషం : వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

వృషభం : శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

మిధునం : వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుగుతాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.

కర్కాటకం : ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి.

సింహం : వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య : నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

తుల : ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం : సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.

ధనస్సు : బంధు మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అనుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

మకరం : ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

కుంభం : చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు తో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి.

మీనం : నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

Next Story