దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

స్థిరాస్తి విషయమై సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

By జ్యోత్స్న  Published on  9 Aug 2024 6:20 AM IST
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

మేషం: స్థిరాస్తి విషయమై సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో బంధు మిత్రుల సలహాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నవి.

మిధునం: వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందటంలో జాప్యం కలుగుతుంది.

కర్కాటకం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

సింహం: చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి మరింత అధికమవుతుంది.

కన్య: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

తుల: నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగం ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించదు.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేయడం మంచిది. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

ధనస్సు: చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. గృహమున ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

మీనం: స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసే అధికారులు మన్ననలు పొందుతారు.

Next Story