దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

By జ్యోత్స్న  Published on  9 Aug 2023 12:44 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

మేషం: అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు.

వృషభం: కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మిధునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

సింహం: కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

కన్య: నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి.

తుల: బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి.

మకరం: దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

కుంభం: ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

మీనం: ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు.

Next Story