దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి

ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

By జ్యోత్స్న  Published on  7 Oct 2023 1:20 AM GMT
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి

మేషం:

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృషభం:

ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది.

మిధునం:

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి.

కర్కాటకం:

నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

సింహం:

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు కలిగిన ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య:

ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతాన విద్యాయత్నాలు సానుకూలమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఋణ భారం తొలగుతుంది.

తుల:

చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.

వృశ్చికం:

రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ధనస్సు:

పాత విషయాలు గుర్తుకు వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మకరం:

విలువైన వస్తు లాభలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అదిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం:

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. బంధు వర్గంతో విభేదాలు తప్పవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి.

మీనం:

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. అనుకోని ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

Next Story