దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్నీ శుభాలే

పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

By జ్యోత్స్న  Published on  6 Sep 2023 12:43 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్నీ శుభాలే

మేషం: ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి.

వృషభం: సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

మిధునం: చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి.

సింహం: వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

కన్య: ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

మకరం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

కుంభం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

మీనం: పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

Next Story