దిన ఫలితాలు: ఈ రాశివారి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి
ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 April 2024 6:11 AM ISTదిన ఫలితాలు: ఈ రాశివారి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి
మేషం:
నూతన వస్తు లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.
వృషభం:
కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. కుటుంబ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.
మిధునం:
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతనోత్సాహంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం:
ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహం:
చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. పాత ఋణలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
తుల:
బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. విద్యా అనుకూలత కలుగుతుంది.
వృశ్చికం:
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
ధనస్సు:
సంతానం విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.
మకరం:
దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసివస్తుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి నూతన ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.
కుంభం:
దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి.
మీనం:
ఋణ ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.