దిన ఫలితాలు: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు

ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.

By జ్యోత్స్న  Published on  3 Sep 2024 1:02 AM GMT
దిన ఫలితాలు: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు

మేషం:

బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి.

వృషభం:

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మిధునం:

ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

కర్కాటకం:

ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి.

సింహం:

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి.

కన్య:

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు.

తుల:

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టి పనులు సకాలంలో పూర్తి సారు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు.

వృశ్చికం:

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు:

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మకరం:

ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువుల పై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

కుంభం:

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలానాలు కలుగుతాయి.

మీనం:

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి వివాదాల పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. కీలక వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.

Next Story