దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది

ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

By జ్యోత్స్న
Published on : 3 July 2025 6:40 AM IST

horoscope, Astrology, Rasiphalalu

దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది

మేషం

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభం

ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

మిధునం

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

కర్కాటకం

సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

సింహం

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘ కాలిక ఋణ సమస్యల నుండి కొంతవరకు బయట పడతారు.

కన్య

రుణాలు తీర్చడానికి చేసేప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది.

తుల

కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు

భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభం

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరలతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు పై దృష్టి సారిస్తారు.

మీనం

ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Next Story