దిన ఫలితాలు: ఈ రాశివారికి ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి
ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు.
By జ్యోత్స్న Published on 3 May 2024 6:11 AM ISTదిన ఫలితాలు: ఈ రాశివారికి ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి
మేషం:
ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.
వృషభం:
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.
మిధునం:
ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.
కర్కాటకం:
రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
సింహం:
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కన్య:
ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.
తుల:
గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు.
వృశ్చికం:
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
ధనస్సు:
దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.
మకరం:
ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.
కుంభం:
కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి. మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి.
మీనం:
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.