దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి

నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

By జ్యోత్స్న  Published on  2 Dec 2023 1:03 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి 

మేషం: చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.

మిధునం: సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహన, గృహ యోగములు ఉన్నవి. వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమం క్రమంగా తొలగుతాయి.

కర్కాటకం: నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

సింహం: చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయటా సమస్యలు పెరుగుతాయి. దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్న పాటి సమస్యలు తప్పవు.

కన్య: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో ఆకారణ కలహ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి.

తుల: నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుం. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది.

ధనస్సు: అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. కుటుంబ వ్యవహారాలలో. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన నష్టాలు తప్పవు. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో వున్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

మీనం: గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. దాయాదులతో స్థిరస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Next Story