బంధువ‌ర్గంతో మాట‌పట్టింపులు, ఆక‌స్మిక ప్ర‌యాణాలు

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది. బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి

By జ్యోత్స్న  Published on  1 April 2023 1:38 AM GMT
Daily Horoscope,Astrology,Rasi Phalalu
ప్ర‌తీకాత్మ‌క చిత్రం


మేషం : దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది. బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధు వర్గంతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

మిధునం : చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం : కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంతనానికి నూతన విద్యా ఉద్యోగఅవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య : ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

తుల : వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

వృశ్చికం : ఉద్యోగమున ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నూతన విషయాలు సేకరిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ధనస్సు : బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి . ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మకరం : చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. దైవ చింతన పెరుగుతుంది వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం : ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మొండి బాకీలు వసూలవుతాయి.

మీనం : నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Next Story