దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి గందరగోళ పరిస్థితులు.. జాగ్రత్త అవసరం

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Feb 2024 6:20 AM IST
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి గందరగోళ పరిస్థితులు.. జాగ్రత్త అవసరం

మేషం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు.

వృషభం: రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది.

మిధునం: ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

కర్కాటకం: దూరపు బంధువుల నుండి అందిన శుభవార్త కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి.

సింహం: అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు.

కన్య: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

తుల: చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.

వృశ్చికం: దైవ చింతన పెరుగుతుంది.పెద్దల ఆరోగ్యసమస్యలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనస్సు: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

మకరం: వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువుల బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం: వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి.

మీనం: సంతాన విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

Next Story