వార ఫలాలు 06-03-2022 నుండి 12-03-2022 వరకు

Astrology from March 6th to 12. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో ఆదరణ పెరుగుతుంది.

By అంజి  Published on  6 March 2022 2:42 AM GMT
వార ఫలాలు 06-03-2022 నుండి 12-03-2022 వరకు

మేషం రాశి : చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో ఆదరణ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. శత్రువులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తొలగుతుంది. కొన్ని రంగాల వారికి అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి నూతన వాహనం కొనుగోలుచేస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు వాయిదా పడతాయి. స్వల్ప ధనవ్యయ సూచనలున్నవి.

పరిహారం : నవగ్రహస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభం రాశి : ముఖ్యమైన పనులు మరింత సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, గృహ క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారి ఆశలు కొంతమేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో దాయదులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథునం రాశి : ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.అవసరాలకు చేతికి సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. బంధు, మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు.గృహ నిర్మాణ విషయంలో తొందరపాటు మంచిది కాదు. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలుకు అవరోధలు తొలగుతాయి. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి.అన్ని రంగాల వారికి ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో స్వల్ప ధనవ్యయ సూచనలున్నవి.కుటుంబసభ్యులతో వివాదాలు తప్పవు.

పరిహారం : వెంకటేశ్వర స్వామి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటకం రాశి : ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. నూతన గృహ వాహన యోగమున్నది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలలో అవరోధలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు.కొన్ని రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో చిన్న పాటి వివాదాలుంటాయి.

పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంట బయట కొన్ని వ్యవహారాలు నేర్పుతో పూర్తి చేస్తారు. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరిలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి : సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.ఉద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు. స్థిరస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంట బయట కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. చిన్నతరహా పరిశ్రమల వారికీ నూతన పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతోచిన్నపాటి వివాదాలుంటాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి నష్టపడతారు.నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. స్థిరస్తి విషయాలలో దాయదులతో విభేదాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.చిన్నతరహా పరిశ్రమలకు పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం ప్రారంభంలో మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైనపరిస్థితులుంటాయి.

పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు సైతం పరిష్కారమౌతాయి. బంధు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. కొన్ని వ్యవహారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారికి మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. వారం చివరిలో మిత్రుల నుంచి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.

పరిహారం : లక్ష్మి నృసింహస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలసిరావు. బంధు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.సంతాన విద్యా ఉద్యోగ విషయంలో అంచనాలు తారుమారు కాగలవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

పరిహారం: విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి : నూతన పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు.వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. కొన్ని రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో స్థిరస్తి వివాదాలు ఉంటాయి. ఆప్తులతో కలహా సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం : సూర్యష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : కొత్త మిత్రులు పరిచయమవుతారు. అనుకోని విధంగా పనులు పూర్తిచేస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి.. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు తగ్గవచ్చు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త కొంత ఊరట ఇస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం : హయాగ్రీవ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు తీరి ఒడ్డునపడతారు. సన్నిహితుల తో వివాదాలు పరిష్కార మౌతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు బాట పడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : నవగ్రహ ఆరాధన చెయ్యటం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story