రెండో వన్డేలో ఫీల్డర్‌గా కివీస్‌ కోచ్‌..!

By Newsmeter.Network  Published on  9 Feb 2020 7:49 AM GMT
రెండో వన్డేలో ఫీల్డర్‌గా కివీస్‌ కోచ్‌..!

ఆక్లాండ్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా మ్యాచ్‌లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ గా మరో ఆటగాడు మైదానంలోకి వస్తాడు. అదే ఆ జట్టు కోచ్‌ ఫీల్డర్‌ గా మైదానంలో అడుగు పెడితే..? రెండో టీ20లో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది.

కివీస్ ఫాస్ట్ బౌలర్‌ టీమ్‌సౌథీ.. అనారోగ్యం కారణంగా భారత ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌ లో మైదానాన్ని వీడాడు. అప్పటికే అతడి కోటా ఓవర్లు పూర్తి అయ్యాయి. అతడి స్థానంలో కుగెలీన్‌ గానీ శాంట్నర్‌ గానీ వస్తారని అంతా బావించారు. అయితే వారిద్దరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ అసిస్టెంట్ కోచ్‌ ల్యూక్‌ రోంచి మైదానంలోకి వచ్చాడు.

ఇలా కోచ్‌లు మైదానంలోకి రావడం ఇదే మొదటి సారి కాదు. ప్రపంచ కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్‌ లో కూడా ఇలా జరిగింది. ఆ మ్యాచ్‌ సబ్‌స్టిట్యైట్ ఫీల్డర్‌గా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లాండ్‌ సహాయక కోచ్‌ కాలింగ్‌వుడ్‌ ఫీల్డింగ్‌ చేశారు. ఇక ఈ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగా ఛేదనలో టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులకే కుప్పకూలిపోయింది.

Next Story
Share it