బయటికి వస్తే మన్కడింగే..
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) రోజు రోజు విస్తరిస్తోంది. కరోనా కట్టడికి 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇంట్లోంచి ఎవరూ కూడా బయటకు రావద్దని ఆదేశించారు. అయినప్పటికి కరోనా తీవ్రతను అర్థం చేసుకోకుండా కొంతమంది బయట తిరగుతున్నారు. దీంతో ప్రజలకు అవగాహాన కగిలించడానికి పలువురు సెలబ్రెటీలు ట్వీట్లు చేస్తున్నారు.
కాగా టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో ప్రజలను గడపదాటవద్దని హెచ్చరించాడు. ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు మన్కడింగ్‌ను గుర్తుకు తెచ్చుకోవాలన్నాడు. 'ఓ వ్యక్తి ఈ చిత్రాన్ని నాకు పంపాడు. మన్కడింగ్ ఘటన జరిగి ఏడాది పూర్తి అయ్యిందని తెలిపాడు. కాగా ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. దీన్ని పౌరులందరూ గుర్తుంచుకోవాలి. బయటకు రావడానికి ప్రయత్నించకండి. 21 రోజులు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండడండి' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. బయటకు వెళితే.. మనకు మనమే రోగాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుందని అశ్విన్ ఉద్దేశం. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ ను అశ్విన్ మన్కడింగ్‌గా ఔట్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.