ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఆప్ స‌త్తా చాటుతుంది. దీంతో మరోసారి సామన్యుడే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించనున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ 54 స్థానాలలో ముందంజ‌లో ఉండి ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ముందుగా వెలువ‌డిన‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది.

ఇప్పటి వరకూ వెలువడి ఫలితాల ప్రకారం.. ఉదయం 11గంటలకు బీజేపీ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా.. బీజేపీ 16 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ఇక ఢిల్లీ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకే ప‌రిమిత‌మైన‌ బీజేపీ.. ఈసారి భారీగా పుంజుకుంది. ఓటింగ్ శాతాన్ని గతం కంటే ఐదు రెట్లు పెంచుకుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ వెలువ‌డిన ప‌లితాల ప్ర‌కారం.. 27 స్థానాల్లో ఆప్‌, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉండ‌గా.. 14 స్థానాల్లో ఆప్‌కు.. బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.

ఇక.. మెడల్‌ టౌన్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్‌ మిశ్రా ముందంజలో ఉన్నారు. చాందినీలో ఆప్‌ 9, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ4, ఈస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ 4, న్యూఢిల్లీలో ఆప్‌ 9, బీజేపీ 1, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 8, బీజేపీ2, వెస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ4, సౌత్‌ ఢిల్లీలో ఆప్‌ 7, బీజేపీ3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మ‌రో రెండు గంట‌ల్లో పూర్తి ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేఫ‌థ్యంలో ఉత్కంఠ వీడ‌నుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.