అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు అరెస్టు వారెంట్ జారీ
By సుభాష్ Published on 30 Jun 2020 1:42 PM ISTఅగ్రరాజ్యం పెద్దన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ దేశం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్య ఘటనపై ఇరాన్ అమెరికాపై ప్రతీకారంలో రగిలిపోతోంది. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సులేమానీ హత్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ సహా 35 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఇరాన్‌లోని అమెరికన్ లక్ష్యాలపై క్షిపణులను పేల్చడం ద్వారా ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడంతో సులేమానీ హత్యతో అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ విషయంలో ఇంటర్ పోల్ సాయాన్ని కోరినట్లు టెహ్రాన్ ప్రాసిక్యూటర్ ఆలీ అల్కాసిమోహరూ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇలాంటి వారెంట్లపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనను యునైటెడ్ స్టేట్స్, ఇంటర్‌పోల్ తోసిపుచ్చాయి.
కాగా, జనవరి 3వ తేదీన ఇరాక్‌లో డ్రోన్ల దాడితో కమాండర్ ఖాసి సులేమానిని హతమార్చిన విషయం తెలిసిందే. సులేమానీ హత్య, ఉగ్రవాద చర్యల ఆరోపణలపై వారెంట్లు జారీచేసినట్లు టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమోహర్ పేర్కొన్నారు. అలాగే సులేమానీ హత్యలో ట్రంప్ ప్రమేయం ఉందని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్‌తో పాటు ఇతర వ్యక్తులను అరెస్ట్ చేయాలని రెడ్ నోటీసులు జారీ చేసిన ఇరాన్.. ఇంటర్ పోల్‌ను కోరిందని ఆయన తెలిపారు.