పీవోకే మనదే: ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 8:26 AM GMT
పీవోకే మనదే: ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌

ఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కాశ్నీర్‌, గిల్గిట్, బాల్టిస్థాన్‌ సహా.. యావత్‌ జమ్మూకశ్నీర్‌ భారతదేవంలో అంతర్భాగమని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. ఫీల్డ్‌ మార్షల్‌ కేఎం కరియప్ప స్మారకోపన్యాసం కార్యక్రమంలో రావత్ పాల్గొని ప్రసంగించారు.

' జమ్మూకశ్నీర్‌లో ఏం జరుగుంది' అనే ఆందోళన మనందరికీ ఉందన్నారు రావత్‌. కశ్నీర్‌, గిల్గిట్‌, బాల్టిస్థాన్ కూడా భారత్‌లో ఓ భాగమే అన్నారు.అయితే ఆ ప్రాంతాలను మనకు పశ్చిమంగా ఉన్నా 'పొరుగు దేశం' ఆక్రమించిందని మండిపడ్డారు. ప్రస్తుతం పీవోకే పాక్ అధీనంలో లేదని, అది ఉగ్రవాదుల అధీనంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై దుస్సాహసానికీ దిగొద్దని పాక్‌ను రావత్‌ హెచ్చరికలు జారీ చేశారు.

1947 అక్టోబర్‌ 26న మహరాజా హరిసింగ్‌ విలీన ఒప్పందంపై సంతకం చేసినప్పుడు రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్స్ అనే మూడు అంశాలు మాత్రమే భారత ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. కానీ...మన రాజ్యాంగంలోని మొదటి అధికరణంలోని ఒక సెక్షన్‌..జమ్మూ కశ్నీర్‌, భారత్‌లో భాగమని స్పష్టంగా చెప్పిందన్నారు. పీవోకే, గిల్గిట్‌, బాల్టిస్థాన్‌తో ప్రాంతాలను మనకు పశ్చిమాన ఉన్న పొరుగు దేశం ఆక్రమించకుంని వ్యాఖ్యనించారు. అనంతరం అరుణాచల్‌ ప్రదేశ్‌లో సేలాలోని వాస్తవాధీన రేఖ వద్ద సైనికుల యుద్ధ విన్యాసాలను రావత్‌ సమీక్షించారు.

Next Story
Share it