వారి సమ్మెకు మద్దతుగా నిలుస్తాం.!
By Medi Samrat Published on 13 Oct 2019 11:42 AM ISTతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు.. ఏపీ ఆర్టీసీ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు నేడు ఏపీ ఆర్టీసీ జేఏసీ నాయకులు.. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ధర్నాలు చెేపట్టనున్నామని ఏపీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాలని ఏపీ ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మొండి వైఖరి మానుకొని ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించి సమ్మె నివారణా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్మికులకు ఈ నెలలో పని చేసిన కాలానికి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు మద్దతుగా ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరూ.. ఎర్ర బ్యాడ్జ్‌లు ధరించి సమ్మెకు సంఘీభావం తెలుపుతూ విధులకు హాజరవుతామని ఏపీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.