ఇప్పుడు ఎవరి నోట విన్నా ఏప్రిల్‌ 14వ తేదీ మాటే వినిపిస్తోంది. ఈ తేదీ భారతీయులకు ప్రాముఖ్యమైన తేదీ అయినప్పటికీ ఈసారి మాత్రం ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత మరింత పెరిగింది. కారణమేమంటే.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనానే. దేశంలో కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. ఈ లాక్‌డౌన్‌ 14తో ముగియనుంది. కాగా ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ లాక్‌డౌన్‌ గడువును 14 నుంచి మరింత పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 14వ తేదీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఫలితంగా ఇప్పుడు ఎవరినోట విన్నా ఏప్రిల్‌ 14నే వినిపిస్తోంది.

Also Read :రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

మరోవైపు మన దేశంలోని ప్రతీఒక్కరికి ఏప్రిల్‌ 14వ తేదీ సుపరిచితమే.. ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రతీఏటా ఈ తేదీని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. దీనికి కారణం.. భారత రాజ్యాంగ సృష్టికర్త బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి కావడమే. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఈ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ప్రతీ యేటా అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. అధికారికంగా ప్రధానితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుసైతం ఈ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.అంబేడ్కర్‌ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటారు.కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. ఎవరూ గుంపులు గుంపులుగా ఉండకూడదనే నిబంధన ఉంది. ఈనేపథ్యంలో కేంద్రం అంబేద్కర్‌ జయంతి రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్