గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ అనుమానపు భర్త రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మంగళగిరిలోని రాజీవ్‌ గృహకల్పలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే భర్త ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.