ఆంధ్రప్రదేశ్‌ జిల్లా పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు..

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 6 March 2020 4:42 PM IST

ఆంధ్రప్రదేశ్‌ జిల్లా పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు..

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వాహాణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జిల్లా పరిషత్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటీఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు గాను మహిళలకు ఏడు స్థానాలు (రెండు బీసీ) రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్‌, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వు చేయబడ్డాయి.

జిల్లాల వారిగా రిజర్వేషన్లు ఇవే..

1 ) అనంతపురం : బీసీ మహిళ

2) చిత్తూరు : జనరల్‌

3) తూర్పుగోదావరి : ఎస్సీ

4) గుంటూరు : ఎస్సీ మహిళ

5) కృష్ణా : జనరల్‌ మహిళ

6) కర్నూలు : జనరల్‌

7) ప్రకాశం : జనరల్‌ మహిళ

8) నెల్లూరు : జనరల్‌ మహిళ

9) శ్రీకాకుళం : బీసీ మహిళ

10) విశాఖపట్నం : ఎస్టీ మహిళ

11) విజయనగరం : జనరల్‌

12: పశ్చిమ గోదావరి : బీసీ

13) కడప : జనరల్‌

Next Story