ఏపీలో 10 పరీక్షలు వాయిదా
By రాణి Published on 24 March 2020 2:50 PM IST
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. సోమవారం కూడా 10 పరీక్షలు యథాతథంగానే జరుగుతాయని సీఎం జగన్ ప్రకటించారు. కానీ..మంగళవారం నాటికి కరోనా కేసులు, కరోనా లక్షణాలున్న వారి సంఖ్య పెరగడంతో మార్చి31వ తేదీ నుంచి జరగాల్సిన 10 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆ శాఖ వెల్లడించింది. రెండు వారాల తర్వాత అంటే..ఏప్రిల్ మూడో వారానికి పరిస్థితి అదుపులోకి వస్తేనే తర్వాతి పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. కరోనా వైరస్ కేసులు మరింత పెరిగితే పరీక్షలు మరో నెలరోజులపాటు వాయిదా పడినా ఆశ్చర్యం లేదు.
Also Read : పెరుగుతున్న కరోనా కేసులు..భారత్ లో 10కి చేరిన మృతుల సంఖ్య
కాగా..తెలంగాణలో ఈనెల 19వ తేదీ నుంచి 10 పరీక్షలు మొదలైనప్పటికీ 23వ తేదీ నుంచి కంటిన్యూ అవ్వాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. రెండ్రోజులుగా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ ప్రకటించిన తొలిరోజు ఎవరూ ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా పెద్దఎత్తున రోడ్లపై వాహనాలు రావడంతో కఠినతర నిబంధనలను అమలు చేసింది రాష్ట్ర పోలీస్ శాఖ. ఇప్పటికి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అవసరమైతే లాఠీఛార్జ్ కూడా చేస్తున్నారు. తాజాగా మూడు కరోనా కేసులు నమోదై రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 36కు చేరడంతో..దాదాపు కర్ఫ్యూ విధించే పరిస్థితి ఏర్పడింది.
Also Read : తెలంగాణ కరోనా కేసులు @36