ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్
By Newsmeter.Network Published on 16 Jan 2020 5:35 PM ISTఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నియమించారు. తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రఘువీరా రెడ్డి పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. దీంతో పార్టీ వ్యవహారాలకు గత కొంత కాలంగా దూరంగా ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్ 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున సింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మంత్రిగానూ పని చేశారు.
Next Story