అమరావతి: వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద రెండో సారి లబ్దిదారులను ఎంపిక చేశామని వైసీపీ ప్రభుత్వం తెలిపింది. రెండో విడతలో 65,054 దరఖాస్తులు వచ్చాయి. కాగా 62,630 దరఖాస్తులకు లబ్దిదారులను గుర్తించామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. 2,36,340 మందికి రెండు విడతల్లో ఆర్థిక సాయం చేశామని పేర్ని నాని పేర్కొన్నారు. వాహనమిత్ర పథకం కోసం రూ.230 కోట్లు కేటాయించమన్న ఆయన.. వచ్చే ఏడాది కొత్త లబ్దిదారులు ఎంతమంది వచ్చినా ఈ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. పేద డ్రైవర్లకు ఆర్థిక సహాయం కింద ఏటా రూ.10 వేలను వైసీపీ ప్రభుత్వం అందిస్తోంది.

అంజి

Next Story