తమ్మినేని వ్యాఖ్యలపై సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం

By అంజి  Published on  27 Nov 2019 11:29 AM GMT
తమ్మినేని వ్యాఖ్యలపై సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం

విజయవాడ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ తిరుమలరావుకు పద్మ శ్రీ ఫిర్యాదు చేశారు. వైసీపీ మంత్రులు, స్పీకర్‌ బాషా వ్యవహార శైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని పద్మశ్రీ చెప్పారు. స్పీకర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సీపీని కోరామని కాంగ్రెస్‌ నాయకురాలు పద్మశ్రీ అన్నారు. తమ్మినేని స్పీకరా.. బ్రోకరా అంటూ పద్మశ్రీ ప్రశ్నించారు. సీఎం పదవి నుంచి వైఎస్‌ జగన్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్‌ నాయకులు పద్మశ్రీ ఆరోపించారు.

Next Story
Share it