గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. కార్యాలయంలో రూ.10 లక్షల రూపాయలను దొంగలు అపహరించుపోయారు. కాగా దొంగతనంపై మంగళగిరి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దుండగుల కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి కార్యాలయంలోని సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.