సత్ఫలితాల బాటలో ఏపీ సర్కార్‌.. నూతన ఇసుక పాలసీ..!

By Newsmeter.Network  Published on  2 Dec 2019 4:10 PM IST
సత్ఫలితాల బాటలో ఏపీ సర్కార్‌.. నూతన ఇసుక పాలసీ..!

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరతను అధిగమించేందుకు జగన్ సర్కార్ నూతన ఇసుక పాలసీని ఏర్పాటు చేసింది. దీంతో వినియోగదారులకు పారదర్శకంగా ఇసుక సరఫరా అవుతుంది. ఈ పాలసీతో నేరుగా ప్రభుత్వమే ఇసుకను అమ్ముతోంది. అక్రమాలు జగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ ఇసుక రీచులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 102 ఇసుక రీచులు అందుబాటులో ఉండగా. 57 ఇసుక స్టాక్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు.

దీంతో గతనెల 30వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23,81,716 టన్నుల ఇసుక సరఫరా చేయగా..ప్రభుత్వానికి రూ.89.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు జగన్‌ సర్కార్‌ తెలిపింది. అంతే కాకుండా బల్క్ వినియోగదారులకు 3,88,955 టన్నులు సరఫరా చేయగా.. సాధారణ వినియోగదారులకు 19,92,761 టన్నులు సరఫరా అయ్యింది.

పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణ వినియోగదారులకు 4,54,354 టన్నులు.. బల్క్ వినియోగదారులకు 27,768 టన్నులు సరఫరా జరిగింది. దీంతో జిల్లాలోని రీచ్‌ ల నుంచి రూ.18.09 కోట్ల మేర ఆదాయం సమకూరింది. శ్రీకాకుళం జిల్లాలో సాధారణ వినియోగదారులకు 1,01,999 టన్నులు.. బల్క్ వినియోగదారులకు 51,199 టన్నులు సరఫరా చేశారు. దీంతో మొత్తం రూ. 5.74 కోట్ల ఆదాయం చేకూరింది. అలాగే.. విజయగనరం జిల్లాలో సాధారణ వినియోగదారులకు 14,766 టన్నులు సరఫరా

జరిగింది.. దీంతో సీనరేజీ ద్వారా రూ. 55 లక్షల రూపాయల ఆదాయం చేకూరింది.

అలాగే.. విశాఖపట్నం జిల్లాలో సాధారణ వినియోగదారులకు 1,18,368 టన్నులు సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 34,156 టన్నులు సరఫరా జరిగింది. దీనిద్వారా మొత్తం రూ.4.24 కోట్ల ఆదాయం చేకూరింది. అలాగే కృష్ణాజిల్లా పరిధిలో సాధారణ వినియోగదారులకు 2,15,539 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 40,591 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. దీని ద్వారా మొత్తం రూ. 9.60 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది.

అలాగే గుంటూరుజిల్లాలో సాధారణ వినియోగదారులకు 2,83,978 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 1,59,037 టన్నుల ఇసుక విక్రయం జరిగింది. - దీని ద్వారా మొత్తం రూ.16.61 కోట్ల ఆదాయం చేకూరింది. అలాగే.. ప్రకాశం జిల్లాలో సాధారణ వినియోగదారులకు 43,306 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్‌ వినియోగదారులకు 2,184 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. దీనితో మొత్తం 1.71 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయం లభించింది.

అలాగే.. నెల్లూరు జిల్లాలో సాధారణ వినియోగదారులకు 1,69,685 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 45,035 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. దీనిద్వారా మొత్తం రూ.8.05 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.

అలాగే... కడప జిల్లాలో సాధారణ వినియోగదారులకు 1,57,388 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 15,275 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. దీని ద్వారా రూ. 6.47 కోట్ల ఆదాయం లభించింది. చిత్తూరుజిల్లాలో సాధారణ వినియోగదారులకు 1,01,246 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 5900 టన్నుల ఇసుక సరఫరా అయ్యింది. దీంతో సీనరేజీ ద్వారా మొత్తం రూ. 4.02 కోట్ల ఆదాయం చేకూరింది.

కర్నూలు జిల్లాలో సాధారణ వినియోగదారులకు 1,01,292 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 510 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. దీనిద్వారా మొత్తం రూ. 3.82 కోట్ల ఆదాయం లభించింది. అలాగే.. అనంతపురం జిల్లాలో సాధారణ వినియోగదారులకు 1,51,799 టన్నుల ఇసుక సరఫరా చేయగా.. బల్క్ వినియోగదారులకు 7,300 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. దీని ద్వారా రూ. 5.97 కోట్ల రూపాయల మేర ఆదాయం ప్రభుత్వానికి లభించినట్లు జగన్‌ సర్కార్‌ ప్రకటించింది

Next Story