అచ్చెన్నాయుడు జైలుకు.. ఏపీ మంత్రి

By సుభాష్  Published on  21 Feb 2020 10:44 AM GMT
అచ్చెన్నాయుడు జైలుకు.. ఏపీ మంత్రి

ఏపీలో రాజకీయం సెగలురేపుతోంది. ఈఎస్‌ఐ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందనడానికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖే సాక్ష్యమన్నారు. విజిలెన్స్‌ అధికారుల నివేదిక ఆధారంగా అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకెళ్లడం ఖాయమని మంత్రి వ్యాఖ్యనించారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై మందుల ధరలను భారీగా పెంచేసి దోపిడీకి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు.

గతంలో చంద్రబాబు సర్కార్‌ కార్మికులను దోచుకుందని, భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో డబ్బులు పంచాలనే ఉద్దేశంతో 2018-19లో రూ. 900 కోట్ల ప్రజాధనాన్ని దొంగబిల్లులుగా సృష్టించి దోచేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో చాలా కుంభకోణాలు జరిగాయని, ఆయనను వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రి వ్యాఖ్యనించారు.

Next Story