ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ ఎస్కార్ట్‌ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ పాపయ్య మృతి చెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే వాహనం టైర్‌ ఒక్కసారిగా పేలడంతో బొలేరో వాహనం పల్టీ కొట్టినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి గచ్చిబౌతి నుంచి విజయవాడకు వెళ్తుండగా, పెద్ద అంబర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.